రైతుగా మారనున్న నాని.!!
on Oct 16, 2018
నేచురల్ స్టార్ నాని, నాగార్జునతో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రం 'దేవదాస్' ఈ మధ్య విడులైంది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రం విడుదలకి ముందే నాని 'జెర్సీ' అనే చిత్రాన్ని అంగీకరించారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మళ్ళీ రావా' ఫేమ్ గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా నాని మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని రైతు పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. పలు షార్ట్ ఫిల్మ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్న 'కిశోరుడు' దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే చిత్రంలో నాని నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కిశోరుడు, నానిని కలిసి కథను వినిపించారట. కథ నచ్చడంతో నాని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ సినిమాలో నాని రైతుగా అభిమానులను అలరించనున్నారు.