గోవాలో నయనతార జాలీడేస్.. రెండు కళ్లు చాలవనిపిస్తోన్న పిక్చర్స్!
on Sep 14, 2020
సుదీర్ఘ కాలంగా సూపర్ హీరోయిన్గా సినిమాల్లో రాణిస్తున్న నయనతార.. లాక్డౌన్ పీరియడ్‌లో బిజీ లైఫ్‌కు కాస్త విరామమిచ్చి బ్రేక్ తీసుకుంది. త్వరలో తన సినిమాల సెట్స్ మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఈలోగా బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్‌తో కలిసి గోవాకు జాలీ ట్రిప్ వేసింది. ఈ విహార యాత్రలో విఘ్నేశ్ ఫొటోగ్రాఫర్‌గా మారి, తన అందాల ప్రేయసిని తన కెమెరాతో అందంగా బంధించి, తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వాటిని షేర్ చేశాడు.
మొదట వైట్ ఫ్లవర్స్ డిజైన్ ఉన్న బ్లాక్ డ్రస్ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్తున్న నయనతార ఫొటోను షేర్ చేశాడు. "Stepping into vacay mood after the mandatory holiday mode." అనే క్యాప్షన్‌ను జోడించాడు. ఆ తర్వాత వైట్ గౌన్‌లో ఉన్న నయనతార వైట్ ఫ్లవర్స్‌ను కోసి వాటిని పైకి విసిరేస్తున్న పిక్చర్లను షేర్ చేశాడు. ఆ ఫొటోల్లో నయనతార సౌంర్యాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అలాగే పచ్చటి పచ్చికతో ఉన్న లాన్లో ఏంజెల్లా నడచుకుంటూ వెళ్తున్న నయన్‌ను వెనుక నుంచి కెమెరాతో బంధించి, షేర్ చేశాడు విఘ్నేశ్.
ఈ ఫొటోలను చూసి నయన్ ఫ్యాన్స్ అమితంగా సంబరపడుతున్నారు. సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తూ వాటిని వైరల్ చేసేశారు. ప్రియురాలికి ఈ ఫొటోల ద్వారా నీరాజనం పలికాడు విఘ్నేశ్.
Also Read