ప్రైవేట్ జెట్‌లో గోవా నుంచి వెనక్కి వచ్చిన నయన్-విఘ్నేష్!
on Sep 22, 2020
'నానుమ్ రౌడీ దాన్' సినిమాకి కలిసి పనిచేసిన రోజుల నుంచీ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల విఘ్నేష్ 35వ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇద్దరూ గోవాకు జాలీ ట్రిప్ వేశారు. పర్సనల్ విషయాలు షేర్ చేసుకొనే విషయంలో నయన్ ఎప్పుడూ వెనకే ఉంటే, విఘ్నేష్ అలియాస్ విక్కీ మాత్రం తమ ఇద్దరి పిక్చర్లు, వీడియోలు రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తూ వస్తున్నాడు.
గోవాలో కొద్ది రోజులు ఏకాంతంగా గడిపిన ఆ ఇద్దరూ సోమవారం సాయంత్రం చెన్నైకి తిరిగొచ్చారు. గోవా నుంచి చెన్నై రావడానికి ఆ ఇద్దరూ ఓ ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్‌ను అద్దెకు తీసుకోవడం విశేషం. ఫ్లైట్‌లో నుంచి దిగి, చేతిలో చేయి వేసుకొని ఇద్దరూ నడుచుకుంటూ వస్తున్న పిక్చర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సెప్టెంబర్ 18న విఘ్నేష్ 35వ పుట్టిన రోజును తన అందాల ప్రేయసి నయనతార సమక్షంలో గోవాలోని కాండోలిమ్ బీచ్‌లోని ఒక రిసార్ట్‌లో జరుపుకున్నాడు. అప్పుడు నయనతారతో కలిసి దిగిన పిక్చర్‌ను షేర్ చేశాడు.
Also Read