ప్రయత్నిస్తూ...ఓడిపోయినవాడు లేడు!!
on Jan 12, 2019
ప్రజంట్ తెలుగు సినీ పరిశ్రమలో పీరియాడిక్ సినిమా హవా కొనసాగుతుందనే చెప్పాలి. ఈ కోవలో తెరకెక్కుతోన్న చిత్రం `జెర్సీ`. ఇదొక ఇంట్రస్టెంగ్ మూవి. వరుస సక్సెస్ లతో దూసుకెళ్లిన యువ హీరో నాని ఇటీవల కాస్త నెమ్మదించాడు. అలాగే తన స్థాయికి తగ్గ హిట్ మాత్రం ఇటీవల రాలేదు. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కన్నడ నటి శ్రద్ధ త్రినాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్ర టీమ్. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న `జెర్సీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా జెర్సీ సినిమా టీజర్ ను విడుదల చేశారు. `క్రికేటర్ కావాలనుకునే ఓ యంగ్ కుర్రాడి స్టోరి గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అర్జన్ పాత్రలో నేచరల్ స్టార్ నాని నటిస్తున్నాడు. టీజర్ లో `ప్రయత్నిస్తూ ...ఓడిపోయినవాడు లేండంటూ ఓ ఎమోషనల్ డైలాగ్ నానితో చెప్పించారు. ఈ డైలాగ్ ప్రస్తుతం హల్ చల్ఛ్ చేస్తోంది. సితార ఎంర్ టైన్ మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్న సమకూర్చడం విశేషం.