బాలయ్య రికార్డు బ్రేక్ చేయబోతున్న నాని
on Mar 10, 2015
ఒకే రోజు... ఒక హీరో సినిమాలు... ఓకేసారి రెండు రిలీజ్ అయితే..??
అప్పుడెప్పుడో నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు ఒకేసారి విడుదలయ్యాయి. ఇప్పుడు అలాంటి ఫీట్ చేయబోతున్నాడు యువ కథానాయకుడు నాని. ఆయన నటించిన రెండు చిత్రాలు ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవే.. జెండాపైకపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం. వీటిలో అందరి దృష్టీ ఎవడే సుబ్రహ్మణ్యంపైనే ఉంది. ఎందుకంటే ట్రైలర్లు ఆకర్షిస్తున్నాయి. దానికి తోడు అశ్వనీదత్ సినిమా. అనేక సార్లు వాయిదా పడ్డ జెండాపైకపిరాజుపై ఎవ్వరికీ ఆసక్తి లేదు. పైగా తమిళంలో ఫ్లాప్ అయిన సినిమా అది. అయినా సరే.. జెండాపైకపిరాజు హక్కుల్ని సొంతం చేసుకొన్న మల్టీడైమెన్షన్ వాసు మాత్రం పట్టుదలతో ఉన్నాడు. అశ్వనీదత్‌పై తమ సినిమాని విడుదల చేయడం ఖాయం అంటున్నారు. మొత్తానికి నాని వర్సెస్ నాని పోటీని చూడబోతున్నామన్నమాట. ఈ ఇద్దరు నిర్మాతలూ కలసి నాని కెరీర్‌తో ఆటాడుకోవడం లేదు కదా..? ఎందుకంటే రెండు సినిమాలూ ఆడడం కల్ల. ఒకవేళ రెండూ ఫ్లాప్ అయితే.. ఒకే రోజు రెండు స్ట్రోకులు తట్టుకోవడం నానికి సాధ్యమేనా??

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
