నాని ‘కృష్ణార్జున యుద్ధం’... మాస్ లుక్ తో ‘కృష్ణ’ ఫస్ట్‌లుక్..
on Jan 14, 2018
వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని.. ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ అనే కొత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాకు సంబంధించి... నాని ‘కృష్ణ’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఓ వీడియోను పోస్ట్ చేసిన నాని.. ఈసినిమాకు సంబంధించి పలు విషయాలు చెప్పారు. ఇటీవల విడుదలైన ‘ఎంసీఏ’ చిత్రాన్ని ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.. తన అప్ కమింగ్ మూవీ ‘కృష్ణార్జున యుద్ధం’ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వస్తోందని.. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇస్తున్నట్టు తెలియజేశారు. అంతేకాకుండా పండుగ మూడు రోజులు మూడు సర్ప్రైజ్లు ఉంటాయని. ముందుగా ఈరోజు (14వ తేదీ) భోగి రోజున ‘కృష్ణార్జున యుద్ధం’ లో తాను చేస్తున్న కృష్ణ పాత్ర యొక్క ఫస్ట్ లుక్‌ను, 15వ తేదీన సంక్రాంతి సందర్భంగా అర్జున్ పాత్ర ఫస్ట్‌లుక్‌ను, 16న కనుమ సందర్భంగా తొలిసాంగ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు నాని. కాగా ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృష్ణుడు, అర్జునుడు కూడా నానియే. ఈ చిత్రంలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుఖ్సార్ మీర్లు నటిస్తున్నారు.