మెగా హీరోలతో క్యూ కడుతున్న నాని హీరోయిన్..!
on May 20, 2016
మెగా క్యాంప్ లో అవకాశాలు ప్రూవ్ చేసుకుంటే, కంప్లీట్ ప్యాకేజ్ తో వరస లభిస్తుందని ఇండస్ట్రీలో అంటుంటారు. ఈ చాన్స్ నాని సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా చేసి హిట్టు కొట్టిన భామ మెహరీన్ పీర్ జ్యాదాకు దొరికినట్టుంది. ఇప్పటికే తొలి సినిమా హిట్ కావడంతో, ఈ అమ్మడికి మంచి అవకాశాలు లైన్ కడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ రెజీనాను తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్న మెగా క్యాంప్, ఇప్పుడు మెహరీన్ కు కూడా ఆ అవకాశం ఇద్దామని ఫిక్సయ్యారు. వరసగా రెండు సినిమాల్ని మెగా హీరోలతో సైన్ చేసేసిందీ భామ. అల్లు శిరీష్ హీరోగా ఎం.వి.ఎస్.రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో పాటు, బివిఎన్ రవి డైరెక్షన్లో సాయిధరమ్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమాకు కూడా మెహరీన్ నే అవకాశం వరించింది. చూడబోతే ఈ భామ కూడా రెజీనా తరహాలో, మెగాక్యాంపులో చాలాకాలం ఉండేలా కనిపిస్తోంది. త్వరలోనే బన్నీ సినిమాలోనో, చెర్రీ సినిమాలోనో పీర్ జ్యాదా కనిపిస్తే ఆశ్చర్యం లేదు.