English | Telugu

తెలుగమ్మాయిలు అయితే డబ్బింగ్ చెప్పుకుంటారని...

on Dec 7, 2019

'నిన్ను కోరి'తో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న రెండో సినిమా 'టక్ జగదీష్'. టైటిల్ అనౌన్స్ చేయగానే వెరైటీగా ఉందనుకున్నారంతా. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసేవారు, సిటీల్లో చాలామంది టక్ చేసుకోవడం కామన్. అందుకని, శివ నిర్వాణ ఈ కథను పల్లెటూరు తీసుకువెళ్లినట్టు ఉన్నాడు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో, సహజత్వానికి దగ్గరగా ఉండే కథను 'టక్ జగదీష్' కోసం శివ నిర్వాణ సిద్ధం చేశాడు. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. 'పెళ్లి చూపులు' తర్వాత తెలుగులో సరైన సినిమాలు చేయని రీతూను నానికి జోడీగా ఎంపిక చేయడంపై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అయితే.. ఆమె ఎంపిక వెనుక కారణం వేరే ఉంది. సినిమా అంతా నేచురల్ గా ఉండాలని శివ నిర్వాణ ప్రయత్నిస్తున్నాడు. తెలుగమ్మాయిలు అయితే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటారని ఐశ్వర్య, రీతూలను ఎంపిక చేశాడు. జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకు కథే హీరోగా ఉంటుందట. 


Cinema Galleries



Latest News


Video-Gossips