English | Telugu

నాని వాటిని మర్చిపోయాడా?

on Apr 16, 2019

 

'ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు వరకు నన్ను జడ్జ్ చేయనిది నా కొడుకు ఒక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను' - జెర్సీ ట్రైలర్ లో డైలాగ్ ఇది. సోమవారం సాయంత్రం జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రేక్షకుల గురించి నాని ఇదే స్టైల్ లో ఒక డైలాగ్ చెప్పాడు.

'ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు వరకు నన్ను జడ్జ్ చేయనిది ప్రేక్షకులు మాత్రమే. మీ (ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ...) దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను' అంటూ స్పీచ్ ముగించాడు నాని. తెలుగు ప్రేక్షకులు తన జడ్జ్ చేయలేదని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు నాని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... నేను లోకల్, ఎంసీఏ సినిమాల టైం లో నానిపై విమర్శలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు విజయాలు సాధించి ఉండొచ్చు. కానీ ప్రేక్షకులు అందరినీ మెప్పించలేదు. నాని మూస ధోరణిలో సినిమాలు చేశాడని, రొటీన్ కథలు ఎంపిక చేసుకున్నాడని విమర్శించారు. ఇక, కృష్ణార్జున యుద్ధం సినిమాపై వచ్చిన విమర్శలు చెప్పక్కర్లేదు. నాని కూడా ఆ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకున్నాడు. బహుశా... ఈ విషయాలన్నిటినీ జెర్సీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మర్చిపోయాడేమో. ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారింది. ప్రతి ఒక్కరిని జడ్జ్ చేస్తున్నారు. ప్రతి సినిమాను జడ్జ్ చేస్తున్నారు. నచ్చని సినిమాలను తిరస్కరిస్తున్నారు. 'జెర్సీ' ‌ ప్రేక్షకులకు నచ్చిందా? లేదా? అనేది ఈనెల 19న తెలుస్తుంది. నాని మాత్రం సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రేక్షకులందరూ గర్వపడే సినిమా చేశానని చెబుతున్నాడు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here