English | Telugu

ఒక గొప్ప సినిమా చేసాన‌నే సంతృప్తితో ఉన్నా-నాని

on Apr 17, 2019

 

నాని క్రికెట‌ర్ గా న‌టించిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 19 న విడుద‌ల‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు ఇప్ప‌టికే మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నాని ఈ రోజు మీడియాతో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు...

అందుకే జెర్సీ టైటిల్ పెట్టాం...
జెర్సీ అంటే క్రికెట‌ర్ యూనిఫార్మ్ అని. ప్ర‌తి స్పోర్ట్స్ మేన్ వేసుకునే యూనిఫార్మ్ ని జెర్సీ అని అంటారు. కేవ‌లం క్రికెట్ స్టోరి కాబ‌ట్టి ఈ టైటిల్ పెట్టామ‌నుకోద్దు. ఇందులో జెర్సీ టైటిల్ కు బ‌ల‌మైన కార‌ణం ఉంది. సినిమా చూస్తే క‌చ్చితంగా టైటిల్ జ‌స్టిఫికేష‌న్ ఏంటో మీకు అర్థ‌మ‌వుతుంది.

ట్రైల‌ర్ లో చాలా చెప్పాం...
ఇది అర్జున్ స‌క్సెస్ ఫుల్ క్రికెట‌ర్ స్టోరీనా? లేక ఫ్ర‌స్టేట‌డ్ క్రికెట‌ర్ స్టోరీనా అంటే రెండూ కావ‌చ్చు, కాక‌పోవ‌చ్చు. ట్రైల‌ర్ లో ఇప్ప‌టికే చాలా స్టోరీ చెప్పేశాం. అర్జున్ ని లూస‌ర్ అన‌డం, త‌క్కువ చేసి మాట్లాడంలాంటివ‌న్నీ ఉంటాయి. వాటివ‌ల్ల ఫ్ర‌స్టేష‌న్ ఉంటుంది. ఆ ఫ్ర‌స్టేష‌న్ వ‌ల్ల అర్జున్ జీవితంలో ఏం జ‌రిగిందనేదే సినిమా స్టోరి.

గ‌ల్లీ క్రికెట‌ర్ ని...
నేను గ‌ల్లీలో క్రికెట్ ఆడేవాణ్ని. స్కూల్లో కూడా నేను లాస్ట్ బ్యాట్స్ మేన్ ని. కొన్ని సార్లు నా టీమ్ లో అంద‌రూ ఓడిపోతేనో, లేకుంటే ఎవ‌రికో ఒక‌రికి దెబ్బ‌లు త‌గిలితేనో నాకు ఆడే అవ‌కాశం వ‌చ్చేది. ఆ బ్యాచ్ అన్న మాట నాది. అంతే త‌ప్ప సీరియ‌స్ గా ఎప్పుడూ ఆడ‌లేదు.
 
చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా...
నా ప్ల‌స్ లు, మైన‌స్ లు ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నా సినిమా విష‌యంలో ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను త‌ప్ప ఓవ‌ర్ కాన్ఫిడెంట్ కాదు. ప్ర‌జంట్ నేను చాలా సంతృప్తితో ఉన్నా. ఒక గొప్ప సినిమా చేసాన‌నే ఫీలింగ్ ఈ సినిమాతోనే వ‌చ్చింది.

ముస‌లివాడిగా అయినా న‌టిస్తా...
నేను ఎటువంటి పాత్ర‌లో అయినా న‌టించ‌డానికి సిద్ద‌మే. ముస‌లివాడిగా చేయ‌మ‌న్నా చేస్తాను. ప్రాస్త‌టిక్ మేక‌ప్ వేసుకోమ‌న్నా సిద్ధంగానే ఉన్నా. న‌టుడిగా నాది కాని వ‌య‌సులో న‌టించ‌డానికి చాలా ఇష్ట‌ప‌డ‌తాను.

ఎవ‌రూ జడ్జ్ చేయ‌లేదు...
ల‌క్కీగా నా సినిమాలు కొన్నిసార్లు స‌క్సెస్ కాన‌ప్పుడు కూడా నా న‌ట‌న గురించి ఎవ‌రూ ఎప్పుడూ ఒక మాట అన‌లేదు. కాక‌పోతే రెండు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసేట‌ప్పుడు నాని ఇక క‌మ‌ర్షియ‌లేనా అని అన్నారంతే.. అది కూడా పెద్ద జ‌డ్జిమెంట్ కాదులెండి. ఇక స్టార్ డ‌మ్ లాంటి వాటి మీద నాకు పెద్ద‌గా న‌మ్మ‌కం లేదు. కంటెంట్ వ‌ల్లే స్టార్ డ‌మ్ వస్తుంద‌ని న‌మ్ముతా.
 
అప్పుడు కొంచెం ప్రెజ‌ర్ ఫీల‌య్యా...
సినిమా, సినిమాకు ఎద‌గ‌డం నాకు పెద్ద‌గా ప్రెజ‌ర్ ఏమీ లేదు. ఎంసీఏ త‌ర్వాత కొంచెం ప్రెజ‌ర్ ఫీల‌య్యాను. ప్ర‌జంట్ మాత్రం ఆ ప్రెజ‌ర్ లేదు. జెండా పై క‌పిరాజు, పైసా ఇలా కొన్ని సినిమాలు వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. ఆ స‌మ‌యంలో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా చేసా. అది మంచి పేరు తీసుకొచ్చింది. నాకు న‌చ్చింది చేసుకుంటూ వెళ్తున్నా.

వాటిని ఇగ్నోర్ చేస్తున్నా...
ప్రారంభంలో సోష‌ల్ మీడియాలో నా పై ఏమైనా రాస్తే వాటిని చూసి కొంచెం ఫీల‌య్యేవాడిని. వాటిని త‌ల‌చుకొని తెగ బాధ‌ప‌డేవాడిని. పోను పోను అంతా అల‌వాటైపోయింది. పిల్ల జ‌మీందార్ సినిమా స‌మ‌యంలో నానికి చాలా త‌ల పొగ‌రు అని రాసారు. అప్పుడు చాలా ఫీల‌య్యా. అప్పుడు అంత బాధ‌ప‌డాల్సి ఉండాల్సి కాదు అని ఇప్పుడ‌నిపిస్తోంది. రాయ‌డం వాళ్ల ధ‌ర్మం, వాటిని ప‌ట్టించుకోకుండా ఇగ్నోర్ చేయ‌డం మ ధర్మం అని ఇప్పుడు అర్థ‌మైంది.

బిగ్ బాస్ తో ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది..
మ‌నం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం కావ‌డం క‌న్నా, ప్ర‌పంచానికి మ‌నం ప‌రిచ‌యం కావ‌డం ప్ర‌ధానం. బిగ్ బాస్ తో  నాకు ప్ర‌పంచం ప‌రిచ‌య‌మైంది. ఇక బిగ్ బాస్ చేసేట‌ప్ప‌డు ఎక్స్ట్రా బ‌ర్దెన్ లా ఎప్పుడు ఫీల‌వ‌లేదు. కాక‌పోతే ఒక్కో ఎపిసోడ్ అక్క‌డ జ‌రుగుతున్న కొద్దీ ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో దాని ర‌ఫ్లెక్ష‌న్ ఉండేది. షోల్ హీట్ పెరిగే కొద్దీ... ఇక్క‌డ సోష‌ల్ మీడియాలో హీట్ పెరిగేది. ఇది నా ఆఖ‌రి ఎపిసోడ్ అని ఎప్పుడు ట్వీట్ చేసానో, ఆ త‌ర్వాత నాని అన్నా ప్లీజ్ క‌మ్ బ్యాక్ అంటూ చాలా మంది అడిగేవారు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here