వరుణ్ తేజ్ వాల్మీకి vs నాని గ్యాంగ్ లీడర్!
on Aug 9, 2019
'సాహో' వెనక్కి వెళ్లింది. కాదు.. కాదు... మిగతా సినిమాలనూ వెనక్కు వెళ్లేలా చేసింది. ఒక సినిమాతో మరో సినిమా పోటీ పడేలా, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను పంచుకునేలా చేసింది. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'సాహో', 30కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతో 30న ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్న నాని'స్ గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13కి వెళ్లింది. నాని కంటే ముందు ఆ తేదీపై వరుణ్ తేజ్ కర్చీఫ్ వేశాడు. 'సాహో' విడుదల తేదీ ప్రకటించిన కొన్ని రోజులకు సెప్టెంబర్ 13న 'వాల్మీకి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆ చిత్రబృందం ప్రకటిచింది. నిజానికి, సెప్టెంబర్ 6న 'వాల్మీకి'ని విడుదల చేయాలనుకున్నారు. మరీ 'సాహో' వచ్చిన వారం రోజులకు రావడం ఎందుకని మరో వారం గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు అదే తేదీకి నాని'స్ గ్యాంగ్ లీడర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో రెండు సినిమాల మధ్య పోటీ తప్పడం లేదు. 'వాల్మీకి' దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం దీన్ని పోటీగా చూడటం లేదు. ఆ రోజు మూవీ లవర్స్ కి పండగ అంటున్నాడు. నాని సినిమాకి విషెస్ చెప్పాడు.