'గ్యాంగ్ లీడర్' టైటిల్‌కు భయపడట్లేదు!
on Aug 26, 2019
'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ పెట్టుకున్నందుకు తామేమీ భయపడట్లేదనీ, పైగా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నామనీ నాని అంటున్నాడు. ఆయన హీరోగా నటించిన 'నానీస్ గ్యాంగ్ లీడర్' మూవీ సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. 'మనం' ఫేం విక్రం కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తికేయ విలన్‌గా కనిపించనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో నాయికగా ప్రియాంక అరుళ్మోహన్ పరిచయమవుతోంది.
చిరంజీవి టైటిల్ రోల్ చేయగా 1991లో రిలీజై బాక్సాఫీస్ బద్దలు కొట్టిన 'గ్యాంగ్ లీడర్' టైటిల్ పెట్టుకున్నందుకు భయం వేయట్లేదా? అనే ప్రశ్న ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్‌లో ఎదురైనప్పుడు నాని స్పందించాడు. "నేను చిరంజీవి గారి 'గ్యాంగ్ లీడర్' మూవీని రిపీట్ చెయ్యడం లేదు. కేవలం టైటిల్‌ని మాత్రమే రిపీట్ చేస్తున్నా. డైరెక్టర్ విక్రం ఫస్ట్ ఆ టైటిల్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అది మనందరికీ చాలా ఇష్టమైన సినిమా. మనమందరం ఓన్ చేస్తుకున్న సినిమా. అప్పుడే ఆ టైటిల్ ఫిక్సయ్యాం.
అదే జోనర్ మూవీ అయితే డేంజర్ అయ్యేది. ఆ జోనర్లో ఐకానిక్ 'గ్యాంగ్ లీడర్'ను మ్యాచ్ చెయ్యడం చాలా కష్టం. మాది ఆ జోనర్ కాదు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రివెంజ్ ఎంటర్టైనర్ అనే కొత్త తరహాది. కొత్త జోనర్ కాబట్టి 'గ్యాంగ్ లీడర్' అనే టైటిల్ పెట్టడానికి భయపడక్కర్లేదు అనిపించింది. ఆ టైటిల్‌తో పోస్టర్ చూసుకుంటామన్న ఆలోచనే ఉద్వేగభరితంగా అనిపించింది. టైటిల్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ వచ్చిన రియాక్షన్ కూడా అంతే సపోర్టివ్‌గా ఉండటం వల్ల మేం తీసుకున్న డెసిషన్ కరేక్టనిపించింది" అని చెప్పుకొచ్చాడు నాని.