'అంటే.. సుందరానికీ!'.. పాయింట్ అదేనా?
on Nov 25, 2020
నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'అంటే.. సుందరానికీ!'. ఈ సినిమాతో కేరళ కుట్టి నజ్రీయా ఫాహద్ తెలుగు తెరకు నేరుగా పరిచయమవుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అదేమిటంటే.. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న 'అంటే.. సుందరానికీ!'.. ఓ బ్రాహ్మణ యువకుడికి, ఓ క్రిస్టియన్ యువతికి మధ్య సాగే లవ్ స్టోరీగా తెరకెక్కనుందట. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్ళి చేసుకునే క్రమంలో సుందరం పాత్రకి ఎదురైన అనుభవాల సమాహారమే 'అంటే.. సుందరానికీ!' చిత్రమట. మరి.. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
