'కల్కి'లో నందితా శ్వేత లుక్ చూశారా?
on Jun 11, 2019
'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి నందితా శ్వేత. తర్వాత 'శ్రీనివాస కళ్యాణం', 'బ్లఫ్ మాస్టర్', 'అభినేత్రి 2', 'సెవెన్' సినిమాలు చేసింది. కానీ, విజయం మాత్రం దక్కలేదు. దాంతో 'కల్కి' మీద ఆశలు పెట్టుకుందీ భామ. రాజశేఖర్ హీరోగా అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 28న విడుదల కానుంది. ఇందులో ముస్లిమ్ అమ్మాయి ఆసిమా పాత్రలో నందితా శ్వేత నటించింది. మీరు ఫొటోలో చూస్తున్నది ఆమె లుక్కే. నిజానికి, సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అదా శర్మ మెయిన్ హీరోయిన్ అని టాక్. పూజితా పొన్నాడ కీలక పాత్రలో నటించింది. అయితే... మూడు పాత్రలకూ ప్రాముఖ్యత ఉందట. 'అ!'లోనూ హీరోయిన్లు ఎక్కువే. అయినా ఎవరి ప్రాముఖ్యత వారికి ఉంది. ఇందులోనూ అంతేనట. రాజశేఖర్, స్కార్లెట్ విల్సన్ పై చిత్రీకరించిన పాటను బుధవారం విడుదల చేస్తున్నారు.