ఎన్టీయార్ జాతీయ పురస్కార విజేతలకు కంగ్రాట్స్!
on Nov 14, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందీ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో... రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీయార్ జాతీయ అవార్డులను కూడా ప్రకటించింది. 2014వ సంవత్సరానికి కాను.. ఎన్టీయార్ జాతీయ అవార్డును సూపర్ స్టార్ రజనీకాంత్ ని వరించింది. ఎన్టీయార్ తో రజనీకాంత్ అనుబంధం దశాబ్దాల కాలం నాటిది. వాళ్లిద్దరూ కలిసి ‘టైగర్2 అనే సినిమాలో నటించారు కూడా. రజనీకాంత్ స్వతహాగా ఎన్టీయార్ వీరాభిమాని. ఆయనకు ఈ రోజు ఎన్టీయార్ అవార్డు లభించడం తెలుగువారందరూ ఆనందించదగ్గ విషయం.
2016వ సంవత్సరానికి కాను.. ఎన్టీయార్ జాతీయ అవార్డు విజేత కమల్ హాసన్
ఎన్టీయార్ తర్వాత మళ్లీ అంతటి మహానటునిగా పేరు పొందిన నటుడు కమల్ హాసన్. వీరిద్దరికీ నటన పరంగా చాలా పోలికలుంటాయ్. తెలుగు తెరపై విభిన్నమైన పాత్రలు పోషించిన మహానటులు వీరిద్దరూ. చాలా సందర్భాల్లో నాకు ఎన్టీయార్ ఆదర్శం అని కమల్ చెప్పిన సందర్భాలున్నాయ్. ఇప్పుడు ఎన్టీయార్ అవార్డు కమల్ని వరించడం నిజంగా ముదావాహం.
Also Read