English | Telugu

2014...2015.. 2016.. నందీ అవార్డు విజేతలు వీరే..

on Nov 14, 2017

2014. 2015, 2016 సంవత్సరాలకు గాను నందీ అవార్డు విజేతల పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2013వ సంవత్సరానికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మంగళవారం మిగిలిన మూడు సంవత్సరాల అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ‘లెజెండ్’ చిత్రానికి ద్వారా..   2014వ సంవత్సరానికి గాను ఉత్తమ నటునిగా నందమూరి బాలకృష్ణ ఎంపికయ్యారు. 

బాలకృష్ణ ఉత్తమనటునిగా నందీ అవార్డు తీసుకోవడం ఇది మూడోసారి. ఇప్పటికే నరసింహనాయుడు, సింహా చిత్రాలను ఉత్తమనటునిగా అవార్డులు అందుకున్న బాలయ్య.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నందీ విజేతగా నిలిచారు. బాలకృష్ణకు నందీ అవార్డు వరించిన చిత్రాల్లో రెండు సినిమాలకు బోయపాటి శ్రీనే దర్శకుడు కావడం విశేషం. 

’లెజెండ్’:-
ప్రజలకోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే మహానాయకునిగా ‘లెజెండ్’లో బాలయ్య కనిపించారు. ఆ సినిమాలో ఆయన నటన... ఆయన పలికిన సంభాషణలకు జనాలు జేజేలు పలికారు. ‘ప్రొద్దుటూరు’లో ఈ సినిమా వెయ్యిరోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. ఇప్పుడు బాలయ్యకు ‘నంది’ కూడా ఈ సినిమా ద్వారానే వరించడం విశేషం. 

2015 నందీ అవార్డు విజేతలు  మహేశ్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి

బాహుబలి:-
2015 సంవత్సరానికి గాను ఉత్తమ చిత్రంగా ‘బాహుబలి’ ఎంపికయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ద్వారా రచ్చ గెలిచిన రాజమౌళి.. ఇప్పుడు నందీ అవార్డు గెలుచుకొని ఇంట కూడా గెలిచారు. 

మహేశ్ నాలుగోస్సారి:-
2015వ సంవత్సరానికి గాను నాలుగోసారి మహేశ్ ఉత్తమనటునిగా ఎంపికయ్యాడు. నిజం, అతడు, దూకుడు సినిమాలకు ఇప్పటికే బెస్ట్ యాక్టర్ గా నందుల్ని అందుకున్న మహేశ్ ఇప్పుడు ‘శ్రీమంతుడు’ చిత్రానికి గాను నాలుగోసారి నందిని గెలుచుకున్నాడు. 

శ్రీమంతుడు:-
ధనికులు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసి దేశ అభ్యున్నతికి పాటుపడాలనే చక్కని సందేశంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేశ్ నటన విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇందులో మహేశ్ ని ప్రేరణగా తీసుకొని చాలామంది సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవడం విశేషం. మహేశ్ కూడా తన సొంత గ్రామమైన ‘బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాడు. ఒక మంచి ప్రయోజనకరమైన కథతో రూపొందిన ఈ చిత్రం ద్వారానే మహేశ్ నాలుగోసారి ఉత్తమనటునిగా ఎంపికవ్వడం విశేషం. 

2016  నాన్నకు ప్రేమతో:-

2016ను జూనియర్ ఎన్టీయార్ జీవితంలో మరిచిపోలేడేమో!  తారక్ ని తొలిసారి ఉత్తమ నటునిగా నిలబెట్టింది ఆ ఏడాదే కదా. 2016వ సంవత్సరానికి కాను ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ద్వారా ఉత్తమ నటునిగా ఎంపికయ్యాడు తారక్. ఒక భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో తండ్రి ఆశయాన్ని నిజం  చేసే తనయుడిగా అద్వితీయమైన నటన కనబరిచాడు తారక్. ఈ సినిమా ద్వారా తారక్ ఉత్తమ నటునిగా ఎంపిక అవ్వడం అభిమానులకు నిజంగా పండగే. 

2012 తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా నందీ అవార్డులను ప్రభుత్వాలే పక్కనపెట్టాయ్. ఇప్పుడు రాష్ట్రాలు రెండుగా మారాక.. నంది అవార్డుల బాధ్యతను ఆంద్రప్రదేశ్ తీసుకుంది. గత ఏడాది 2013వ సంవత్సరానికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం... ఇప్పుడు 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించింది. 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here