సంక్రాంతి వీరుడు!
on Jan 14, 2018
‘సంక్రాంతి వీరుడు’ ఇలా పిలిపించుకునే అర్హత గల ఏకైక హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు మాత్రమే. ఎందుకంటే.. సంఖ్యా పంరంగా, విజయాల పరంగా ఎన్టీయార్ కు ఉన్నన్ని సంక్రాంతి హిట్లు, సంక్రాంతి సినిమాలు వేరే ఏ హీరోకీ లేవ్.
తొలి సినిమా ‘మన దేశం’ నుంచి రాజకీయాల్లోకెళ్లే ముందు చేసిన ‘నా దేశం’ వరకూ... అంటే 33 సంవత్సరాల కెరీర్లో... 32 సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయంటే... ఎన్టీయార్ సంక్రాంతి సెంటిమెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాటిల్లో దాదాపు పాతిక సినిమాలు విజయాలు సాధించాయ్. దటీజ్ ఎన్టీయార్. అందుకే.. ఆయన సంక్రాంతి వీరుడు.
మహానటుడు సంక్రాంతి సినిమాల్లో అద్భుతాలున్నాయ్. మిస్సమ్మ, శ్రీ సీతారామకల్యాణం, పాండవ వసనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, గులేబకావళి కథ, దానవీర శూరకర్ణ... తదితర అద్భుతాలన్నీ సంక్రాంతికి వచ్చినవే.
1953 సంక్రాంతికి ఎన్టీయార్ నటించిన తమిళ చిత్రం ‘వెలైక్కారీ మంగళ్’ విడుదలైంది. అప్పట్నుంచి 1982 వరకూ.. మధ్యలో 1957, 1979.సంక్రాంతులు మినహా.. ప్రతి సంక్రాంతికి ఎన్టీయార్ సినిమా విడుదలైంది. దటీజ్ ఎన్టీయార్. ఎన్టీయార్ సంక్రాంతి సినిమాల వివరాలు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తోంది తెలుగువన్. చూసి తెలుసుకోండి.
1. 1953 సంక్రాంతి వెలైక్కారీ మంగళ్ (తమిళ్)
2, 1954 సంక్రాంతి చంద్రహారం
3. 1955 సంక్రాంతి మిస్సమ్మ
4. 1956 సంక్రాంతి నయా ఆద్మి, తెనాలి రామకృష్ణ
5. 1959 సంక్రాంతి అప్పుచేసి పప్పుకూడు
6. 1960 సంక్రాంతి శ్రీ వేంకటేశ్వరమహత్మ్యం
7. 1961 సంక్రాంతి సీతారామ కల్యాణం
8. 1962 సంక్రాంతి గులేబకావళి కథ
9. 1963 సంక్రాంతి శ్రీ కృష్ణార్జున యుద్ధం, ఇరుగు-పొరుగు
10. 1964 సంక్రాంతి కర్ణన్(తమిళం), గుడిగంటలు
11. 1965 సంక్రాంతి నాదీ ఆడజన్మే, పాండవ వనవాసం
12. 1966 సంక్రాంతి శ్రీ కృష్ణ పాండవీయం
13. 1967 సంక్రాంతి గోపాలుడు - భూపాలుడు
14. 1968 సంక్రాంతి ఉమా గౌరీ చండీ శంకరుల కథ
15. 1969 సంక్రాంతి వరకట్నం
16. 1970 సంక్రాంతి తల్లా-పెళ్లామా?
17. 1971 సంక్రాంతి శ్రీ కృష్ణ విజయం
18. 1972 సంక్రాంతి శ్రీ కృష్ణ సత్య
19. 1973 సంక్రాంతి డబ్బుకు లోకం దాసోహం
20. 1974 సంక్రాంతి పల్లెటూరి చిన్నోడు
21. 1975 సంక్రాంతి శ్రీ రామాంజనేయ యుద్ధం
22. 1976 సంక్రాంతి వేములవాడ భీమకవి
23. 1977 సంక్రాంతి దానవీర శూరకర్ణ
24. 1978 సంక్రాంతి మేలుకొలుపు, సతీ సావిత్రి
25. 1980 సంక్రాంతి ఛాలెంజ్ రాముడు
26. 1981 సంక్రాంతి ప్రేమ సింహాసనం
27. 1982 సంక్రాంతి అనురాగ దేవత