నమ్రత ఇన్నోవా కారు వెనుక కథేంటో తెలుసా?
on Jul 1, 2020
నమ్రతకు ఇష్టమైన హీరో మహేష్‌బాబు అని ఎవరైనా చెప్పేస్తారు. బాలీవుడ్లో సినిమాలు చేసినప్పటకీ, అక్కడి హీరోలను చూసినప్పటికీ... హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్‌బాబును పెళ్లాడారు. ఆమెకు ఇష్టమైన సినిమాలు భర్తవే ఉంటాయి. అయితే, నమ్రతకు వ్యక్తిగతంగా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా! ఆమెకు ఇష్టమైన నటి, డ్రస్, స్వీట్ ఇలా! రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆడియన్స్ అడిగితే తనకు ఇష్టమైనవి ఏంటో చెప్పుకొచ్చారు.
ఫేవరెట్ యాక్టర్?
మెరిల్ స్ట్రీప్.
డ్రస్సింగ్ స్టైల్?
వైట్ షర్ట్, జీన్స్.
కలర్?
వైట్.
డిజైనర్?
మ్యాక్స్ మారా.
పర్ఫ్యూమ్?
ఏంజెల్.
స్వీట్?
రసగుల్ల.
హైదరాబాదీ బిర్యానీ ఇష్టమేనా?
ఇష్టమే. అజీజా బిర్యానీ నా ఫేవరెట్.
ఇష్టమైన నగ?
నా తాళి.
కార్?
నా ఇన్నోవా. ఇంతకు ముందు నా పేరెంట్స్ ఉపయోగించిన కార్. ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నా.
Also Read