మంచులో సితార.. వీడియో షేర్ చేసిన నమ్రత.. కామెంట్ చేసిన శిల్ప!
on Sep 14, 2020
నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే, తన పిల్లలు గౌతమ్, సితారకు తల్లిగా ఆమె ఎంత పర్ఫెక్ట్ రోల్ పోషిస్తోందో అర్థమవుతుంది. ఉదాహరణకు ఆరు రోజుల క్రితం తన పిల్లలకు చెందిన ఓ వీడియోను నమ్రత షేర్ చేశారు. అందులో గౌతమ్ టాబ్లెట్‌లో ఏదో చూసుకుంటూ ఉంటే, సితార మరాఠీలో గణపతి హారతిని పాడుతూ ఉంది. అందులో విశేషమేమంటే అది ఇప్పటి వీడియో కాదు.. సితారకు మూడేళ్ల వయసున్నప్పటిది. అర్థం తెలీకపోయినా, ఎలా పలకాలో తెలీకపోయినా నిజాయితీగా దాన్ని పాడుతున్నదంటూ మురిసిపోయింది నమ్రత. దానికి #pricelessmemories అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
తాజాగా తన ఐజీ హ్యాండిల్లో తన మదర్ డ్యూటీని మరోసారి చాటి చెప్పారు నమ్రత. సితారతో కలిసి మంచులో జారుతున్న వీడియోను ఆమె షేర్ చేశారు. గత ఏడాది పిల్లల్ని తీసుకొని మహేశ్, నమ్రత దంపతులు స్విట్జర్లాండ్‌కు వెళ్లారు. అక్కడి ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో జాలీగా గడిపారు. అందులో ఓ వీడియోను ఇప్పుడ ఆమె షేర్ చేశారు. తన ప్లే పార్టనర్‌తో మంచులో ఆడుకుంటున్నాననీ, స్విస్ ఆల్ప్స్ పర్వతాలు తనకెప్పుడూ ఫేవరేట్ హాలిడే స్పాట్ అనీ ఆమె రాసుకొచ్చారు. మనల్ని కూడా మన ఫేవరేట్ హాలిడేను షేర్ చెయ్యమని కోరారు. #letsrewind #takemeback #memories అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు. అయితే మహేశ్, గౌతమ్లలో ఎవరు ఆ వీడియో తీశారో నమ్రత చెప్పలేదు.
ఈ వీడియో చూసిన నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ స్పందించారు. ఇది చాలా ఫన్‌గా ఉందనీ, నెక్ట్స్ టైమ్ తను కూడా వాళ్లతో జాయిన్ అవుతాననీ కామెంట్ చేశారు.
Also Read