నమిత పొంగల్ ముగ్గులు వైరల్!
on Jan 16, 2021
తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరు తెచ్చుకొనే తారలు కొద్దిమందే ఉంటారు. వారిని ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోరు. అలాంటి తారల్లో నమిత ఒకరు. ఆమె వేళ్లమీద లెక్కించదగ్గ సినిమాల్లోనే నటించింది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా లేవు. అయినా నమిత వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రభాస్‌తో ఆమె పేరు కలిసి సోషల్ మీడియాలో విరివిగా కనిపించింది. 'బిల్లా' సినిమాలో చేసే టైమ్‌లో ఆ ఇద్దరి మధ్యా బంధం పెనవేసుకుందంటూ వదంతులు షికార్లు చేశాయి. అయితే వాటిని నమిత ఖండించారు.
తన ఫిగర్తోటే నమిత చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. మధ్యలో బాగా బరువు పెరగడం వల్ల హీరోయిన్ చాన్సులు తగ్గిపోయాయి. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరచారు. ఆ షో నుంచి బయటకు వచ్చాక తన బాయ్‌ఫ్రెండ్ వీరేంద్రను 2017లో ఆమె పెళ్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె, ప్రస్తుతం తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆమె స్టార్ కాంపైనర్.
కాగా సంక్రాంతి పండుగను ఆమె తన కుటుంబంతో జాలీగా జరుపుకున్నారు. తమ ఇంటి ముందు స్వయంగా ముగ్గులు వేసి, వాటికి రంగులద్దారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏమైనా నమిత గ్లామరే వేరు!