`దేవదాస్` టార్గెట్ రీచ్ అవుతాడా???
on Sep 25, 2018
నాగార్జున, నాని హీరోలుగా రూపొందిన మల్టీస్టారర్ చిత్రం `దేవదాస్`. ఇందులో నాగార్జున దేవ అనే పాత్రలో డాన్ గా కనిపించబోతుండగా, నాని దాస్ పాత్రలో డాక్టర్ గా అలరించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ ఈ చిత్రం పై హైప్ తీసుకొచ్చాయి. మహానటి చిత్రంతో మళ్లీ లైన్ లోకి వచ్చిన వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ బేనర్ లో ఆఖరిపోరాటం, గోవిందా గోవిందా, రావోయి చందమామ, ఆజాద్ చిత్రాలు చేసిన నాగార్జున, చాలా గ్యాప్ తర్వాత ఈ సంస్థలో నటించాడు.
ఇక ఈ మూవీ ఆంధ్రాలో 14కోట్లు, నైజామ్ లో 11 కోట్లు , సీడెడ్ లో 5 కోట్లు , ఓవర్సీస్ లో 4.5కోట్ల బిజినెస్ జరిగినట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ సినిమా టోటల్ గా దాదాపు 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం 37 కోట్లు జరిగితే కానీ హిట్ అయినట్లు లెక్క. మరి నాగ్ , నానిలు ఆ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అన్నది చూడాలి. నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటించగా, నానికి జోడీగా రష్మిక మండన్న నటించింది. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.