లక్కీ మంత్లో నాగ్
on Apr 12, 2021
కింగ్ నాగార్జునకి అచ్చొచ్చిన నెలల్లో డిసెంబర్ ఒకటి. `మన్మథుడు`, `మాస్`, `కింగ్`, `రగడ`.. ఇలా డిసెంబర్ మాసంలో నాగ్ నుంచి వచ్చిన పలు చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత మరోమారు ఇదే నెలలో తన నెక్ట్స్ వెంచర్ తో ఈ అక్కినేని హ్యాండ్సమ్ హీరో సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `గరుడవేగ` ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చకచకా పూర్తి చేసి.. నాగ్ లక్కీ మంత్ డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
నాగ్ - ప్రవీణ్ సత్తారు ఫస్ట్ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్ట్రస్ గుల్ పనాగ్ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది.
మరి.. నాగ్ గత చిత్రం `వైల్డ్ డాగ్` ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో.. రాబోయే చిత్రమైనా కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.