రిటైర్డ్రా అధికారిగా నాగ్?
on Feb 24, 2021
కింగ్ నాగార్జున, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం నాగ్ తదితరులపై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరిపి, ఆపై తదుపరి షెడ్యూల్ ని గోవాలో షూట్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నాగ్ ఓ రిటైర్డ్ రా అధికారిగా కనిపిస్తారని, ఆయన పాత్ర యాక్షన్ తో పాటు ఎమోషనల్ గా సాగుతుందని సమాచారం. బాలీవుడ్ నటి గుల్ పనాగ్.. నాగ్ కి చెల్లెలిగానూ, అనిఖ సురేంద్రన్ మేనకోడలిగానూ దర్శనమివ్వనున్నారని టాక్. నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. నాగ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు.
కాగా, నాగ్ తాజా చిత్రం `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో నాగ్ కి జోడీగా దియా మీర్జా నటించగా, కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనుంది.