English | Telugu

క్లైమాక్స్ కౌంట‌ర్ కోసం నాగ‌బాబు క‌స‌ర‌త్తులు!!

on Jan 10, 2019

 
రోజుకొక వీడియో విడుద‌ల చేస్తూ బాల‌య్య పై నాగ‌బాబు చేసే యుద్ధం ఇప్పుడ‌ప్పుడే ఆగేలా క‌నిపించ‌డంలేదు.  ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ రిలీజ్ రోజు ఒక షార్ట్ ఫిలింతో పాటు మ‌రో కామెంట్ కూడా రిలీజ్ చేశాడు నాగ‌బాబు. ఇక మెగా బ్ర‌ద‌ర్ తీరు చూస్తుంటే   మాట‌ల యుద్ధాన్ని ఇంకా  తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఇంత కాలం మౌనంగా ఉండి ఫేస్ బుక్ లో ఇప్పుడు ఎందుకు? ఇంత ఘాటుగా విమ‌ర్శిస్తున్నాను అనే దానికి కూడా కార‌ణం చెప్పుకొచ్చాడు నాగ‌బాబు. ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌య్య మెగా బ్ర‌ద‌ర్స్ ని ఆరుసార్లు విమ‌ర్శించాడ‌ని ...ఒక్క‌సారి కూడా తాను దేనికి కూడా ప్ర‌తిస్పందించాడ‌ని ....అయితే మౌనంగా ఉన్నా కొద్దీ ఇంకా మితిమీరుతున్నాడ‌ని అందుకే మాట్లాడాల్సి వ‌స్తోంద‌ని చెప్పాడు ఓ వీడియో ద్వారా నాగ‌బాబు. ఇంకా తాజాగా విడుద‌ల చేసిన దాంతో చాలా విష‌యాలు ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.  

ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన ఏ వీడియోలో బాల‌య్య పేరు నేరుగా ప్ర‌స్థావించ‌లేద‌నీ...అభిమానులే అన‌వ‌స‌రంగా ఏవేవో ఊహించుకుంటూ `` గుమ్మ‌డికాయ‌ల దొంగెవరంటే...భుజాలు త‌డుముకుంటున్న `` చందంగా స్పందిస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు.

బాల‌కృష్ణ ఎవ‌రో తెలియ‌ద‌ని అనే ఒక్క మాట‌కే కోపం వ‌స్తే ...మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాన్ , చిరంజీవిని అన్నందుకు త‌మ‌కు ఎంత కోపం రావాలి అని ప్ర‌శ్నిస్తున్నారు మెగా బ్ర‌ద‌ర్. మీరైతే ఒక్క మాట కూడా స‌హించ‌లేరు. మేము మాత్రం మీరు ఎన్ని అన్న మౌనంగా ఉండాలా? అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. కావాల‌నే నేను బాల‌కృష్ణ ఎవ‌రో తెలియ‌ద‌ని అన్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. నేను ఫేస్ బుక్ లో ఏదో క‌విత రాసుకుంటే...మీకోసం పెట్టిన‌ట్లు  ఎందుకు అన్వ‌యించుకుంటున్నారు. మీరు బ‌యోపిక్ లో అబ‌ద్ధాలు తీస్తున్నారా? అంటూ సెటైర్లు వేసారు.  

 ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన కామెంట్లు ఒక ఎత్తైతే మ‌రోక కామెంట్ ఉంద‌నీ...దాన్ని కూడా ప‌బ్లిక్ తో పంచుకుని అప్పుడు శుభం కార్డ్ వేస్తానంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్. ప్రజంట్ దాని కోసం ప్రూఫ్స్ సేకరించే ప‌నిలో ఉన్నాన‌నీ...అవి దొరికిన వెంట‌నే ఫైన‌ల్ గా కామెంట్ రిలీజ్ చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు.  ఆ ఆరో కామెంట్ ఏంటో? అది ఎప్పుడు? ఎలా ? ఉండ‌బోతుందో న‌ని అంద‌రూ ఎదురు చూస్తున్నారు.  చూద్దాం దీనికి బాల‌య్య ఎలా  ప్ర‌తిస్పందిస్తాడో మ‌రి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here