'లూజర్' దర్శకుడితో నాగచైతన్య సినిమా!
on Sep 25, 2020
ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య 'లవ్ స్టోరీ' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత చేయబోయే సినిమాకు నాగచైతన్య సంతకం చేశాడని సమాచారం.
తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్ లలో హిట్ టాక్ తెచ్చుకున్న వాటిలో 'లూజర్' ఒకటి. దీనికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. 'ఎక్కడికి ఈ పరుగు' అని మరో వెబ్ సిరీస్ కూడా తీశారు. అతడు చెప్పిన కథ నాగచైతన్యకు నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
'లవ్ స్టోరీ' చిత్రీకరణ పూర్తయిన తర్వాత అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని నాగచైతన్య అనుకుంటున్నారట. 'లూజర్' నిర్మాతలలో అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంది. ఇప్పుడు చైతు సినిమాను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ మీద నిర్మిస్తారని సమాచారం.
Also Read