సంతోష క్షణాన.. అక్కినేని కుటుంబంలో విషాదం
on Nov 14, 2017
తన తనయుడు నాగచైతన్య పెళ్లి వేడుకతో నెల రోజుల పాటు ఎంతో సరదాగా గడిపారు కింగ్ అక్కినేని నాగార్జున.. ఈ ఆదివారం అక్కినేని కుటుంబం మొత్తం సమంత-నాగచైతన్యల వెడ్డింగ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇంత ఆనందకరమైన సమయంలో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. వీరికి చెందిన అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ యాక్సిడెంట్‌కి అక్కినేని వారింట విషాదానికి కారణం ఏంటి అనుకుంటున్నారా..? నాగ్ తండ్రి, మహానటుడు స్వర్గీయ నాగేశ్వరరావుగారి చివరి సినిమా మనం కోసం వేసిన సెట్ ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఏఎన్నార్ తన చివరి రోజులను అక్కడే గడపటంతో ఆ సెట్‌ను నాగ్ అపురూపంగా చూసుకుంటున్నారు. అలాంటి చోట అగ్నిప్రమాదం జరగడం ఆయనతో పాటు అక్కినేని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. విషయం తెలుసుకున్న నాగార్జున పరుగుపరుగున స్టూడియోకి చేరుకున్నారు.. కళ్లేదుటే తన తండ్రి జ్ఞాపకం మంటల్లో కాలిపోవడంతో ఆయన కాస్తంత ఉద్వేగానికి గురయ్యారు.
Also Read