రూమ్ రెంట్లే పేలిపోతున్నాయ్!
on Oct 4, 2017
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? చెప్పండి? అసలే... డబ్బున్న మారాజులు.. ఏమైనా చేస్తారు. అవసరమైతే... పెళ్లి చంద్రమండలంలో చేస్తారు. ఏంటంట! ఏంటి?... ఎవరి గురించా! అనుకుంటున్నారా? ఇంకెవరు... మన కింగ్ నాగార్జున గారి గురించి. వారబ్బాయ్ నాగచైతన్య వివాహం గోవాలో జరుగనున్న విషయం తెలిసిందేగా! సమంతతో సంసార సాగరంలోకి అడుగుపెట్టడబోతున్నాడు అక్కినేని వారబ్బాయ్. ఈ వివాహ వేడుక 6,7 తారీకులలో గోవాలోని ‘డబ్ల్యూ’ అనే స్టార్ హోటల్లో జరగనుంది. సమంత, నాగచైతన్య కుటుంబ సభ్యులు ఓ వందమంది... చైతూ, సమంతల ముఖ్యమైన ఫ్రెండ్స్ కొంతమంది... మొత్తం సుమారు ఓ రెండొందల మంది ఈ వేడకకు హాజరవుతారట.
మొత్తానికి టాలీవుడ్ లో జరిగిన కాస్ట్లీ పెళ్లిల్లలో చైతూ, సమంతల వివాహం కూడా ఒకటి కానుంది. అదెలాగంటారా? రేపు అతిథులు బస చేసే ‘డబ్ల్యూ’ హోటల్ రూమ్ రెంట్లని ఒక్కసారి గమనిస్తే... ‘కరెక్ట్.. ఇది కాస్ట్లీ పెళ్లే’ అని మీరే ఒప్పుకుంటారు. ఈ హోటల్లో ఒక రూమ్ రెంట్ రోజుకి 17 వేలు. ఖరీదైన సూట్ అయితే... 75 వేలు. ఈ హోటల్ లో దాదాపు సగంపై రూములన్నీ అక్కినేని ఫ్యామిలీనే బుక్ చేసేసిందట. అంతేకాదు... పక్కనే ఉన్న మరో స్టార్ హోటల్ రూముల్ని కూడా బుక్ చేశారని సమాచారం.
రెసెప్షన్ విషయం గురించి నాగచైతన్యతో నాగ్ మాట్లాడితే... ‘అదేం వద్దులేండి’ అనేశాడట. కానీ.. నాగ్ ఊరుకుంటాడా? ‘నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకు’ అని... రానున్న 15న హైదరాబాద్ ‘ఎన్ కన్వెన్షన్ సెంటర్’లో ఘనంగా రిసెప్షన్ కి నాగ్ ప్లాన్ చేశాడట. ఆ వేడుకకు మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్నీ ఆహ్వానిస్తాడట. అదనమాట విషయం. మరి అక్కినేని వారి పెళ్లా.. మజాకా
Also Read