'లవ్ స్టోరీ'.. డేట్ ఫిక్సయిందా?
on Jan 17, 2021
'ఫిదా' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'. యువ సామ్రాట్ నాగచైతన్య, డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశారు శేఖర్. తన గత చిత్రాల తరహాలోనే ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లా లవ్ స్టోరీ ఉంటుందని ప్రచార చిత్రంతో చెప్పకనే చెప్పేశారు. కెరీర్ కోసం సిటీకి వచ్చిన రేవంత్, మౌనిక అనే ఇద్దరు స్ట్రగులింగ్ యంగ్‌స్టర్స్ మధ్య సాగే బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా, ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మార్చి 26న విడుదల చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అదే రోజున నితిన్ - కీర్తి సురేష్ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'రంగ్ దే'తో పాటు రానా ప్రధాన పాత్రలో నటించిన 'అరణ్య' కూడా విడుదలకు సిద్ధమయ్యాయి. మరి.. ఈ త్రిముఖ పోటీలో ఏ చిత్రానికి జనాదరణ దక్కుతుందో చూడాలి.