English | Telugu

ఆ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందా!!

on Dec 5, 2018


       

సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్ ఎక్కువ‌.ఒకసారి ఒక కాంబినేష‌న్ క‌లిసొచ్చిందంటే ఆ కాంబోలో సినిమాలు చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అలాగే నిత్య మీన‌న్ వ‌రుస‌గా ప్లాపుల‌లో ఉన్న హీరోల‌తో న‌టిస్తే ఆ హీరోకి క‌చ్చితంగా స‌క్సెస్ ప‌డుతుంద‌నే ఒక సెంటిమెంట్ చాలా కాలంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవ‌ల వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతోన్న నాగ చైత‌న్య స‌ర‌స‌న , నిత్య మీన‌న్ ని  హీరోయిన్ గా తీసుకోవాల‌న్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌ యువి క్రియేష‌న్స్ వారు. మ‌రి ఈ సారైన చైతు కి స‌క్సెస్ వ‌స్తుందా?  నిత్య మీన‌న్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుంతా లేదా అన్న‌ది చూడాలి మ‌రి.  ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు.

ప్ర‌స్తుతం నాగ చైత‌న్య , స‌మంత ఓ చిత్రంలో క‌లిసి న‌టిస్తున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవ‌లే వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చింది. హైద‌రాబాద్ లో త్వ‌ర‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే యువి క్రియేష‌న్స్ లో గాంధీ మేర్ల‌పాక ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తాడు నాగ చైత‌న్య‌.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here