50 కోట్ల క్లబ్ లో `మజిలీ`
on Apr 15, 2019
నాగచైతన్య, సమంత జంటగా రూపొందిన చిత్రం `మజిలీ`. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ క్రికెటర్ గా నటించాడు. చైతు ఈ సినిమాలో నటనకు ఇటు విమర్శకుల నుండి అటు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. విడుదలైన రోజు నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో నే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.
అయితే ఈ సినిమా ఐదు రోజుల్లోనే 23 కోట్ల షేర్ సాధించించి అందర్నీ షాక్ కి గురి చేసింది. ఇక పది రోజులలో వరల్డ్ వైడ్ గా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి చైతు, సామ్ నటనతో పాటు దర్శకుడి ప్రతిభ, గోపిసుందర్ పాటలు, తమన్ నేపథ్య సంగీతం హైలెట్ గా నిలిచాయంటున్నారు. ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేయనుందో అంటున్నారు సినీ పండితులు.