పూజ కోసం చైతు ప్రేమపాట్లు
on Feb 19, 2014
నాగచైతన్య హీరోగా "గుండెజారి గల్లంతయ్యిదే" చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఒక అమ్మాయి ప్రేమకోసం అబ్బాయి పడిన కష్టమే ఈ చిత్రం. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. మార్చి చివరి వరకు టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. ఏప్రిల్ మొదటివారంలో విదేశాల్లో పాటల్ని చిత్రీకరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి "ఒక లైలా కోసం" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.