English | Telugu

అల్లు అర్జున్‌ను అడ్డుకున్న మమతా బెనర్జీ

on Feb 7, 2018

మమతా బెనర్జీ ఏంటీ..? అల్లు అర్జున్‌ని అడ్డుకోవడం ఏంటీ..? కనీసం ఇద్దరికి ముఖ పరిచయం కూడా లేదు. మమత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఒక పార్టీకి అధినేత్రి.. బన్నీ ఒక మామూలు హీరో.. ఇద్దరికీ ఎలాంటి విభేదాలు లేవు.. మరి బన్నీని అడ్డుకోవాల్సిన అవసరం మమతాకి ఏం వచ్చిందంటే.. ప్రజంట్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు స్టైలీష్ స్టార్. అనుకున్న డేట్‌కి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్న చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్‌ని జరుపుతోంది. 15 రోజుల షెడ్యూల్‌లో భాగంగా డార్జిలింగ్‌లో షూటింగ్ జరుపుకుంటుండగా.. నాలుగు రోజుల పాటు దానికి పేకప్ చెప్పారు అక్కడి పోలీసులు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాలుగు రోజుల పాటు డార్జిలింగ్‌లో పర్యటిస్తున్నట్లు సీఎంవో నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో.. సీఎం భద్రత దృష్ట్యా వారు నా పేరు సూర్యతో పాటు అక్కడ జరుగుతున్న వివిధ సినిమా షూటింగ్‌లను నిలిపివేయాల్సిందిగా ఆదేశించారు. షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం.. నాలుగు రోజులు ఖాళీగా ఏం చేయాలో తెలియక సరదాగా డార్జిలింగ్‌లో ఏంజాయ్ చేస్తోంది చిత్ర యూనిట్. సో.. అదన్న మాట అసలు విషయం.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here