English | Telugu

అర్జున్‌రెడ్డి... పాటలకు సారీ!

on Oct 1, 2018


విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో ‘అర్జున్‌రెడ్డి’ ఓ మైల్‌స్టోన్‌! ‘పెళ్ళి చూపులు’ విజయంతో కెరీ‌ర్ మీద కాస్త ధీమాతో ఉన్న అతడిని ఓవర్‌నైట్‌ స్టార్‌ చేసేసిన సినిమా అర్జున్ రెడ్డి. ప్రేక్షకులు, పలువురు విమర్శకులు ‘అర్జున్‌రెడ్డి’ని కల్ట్‌ క్లాసిక్‌గా అభివర్ణిస్తున్నారు. ఆ సినిమా విజయంలో విజయ్‌ దేవరకొండ నటన, సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంతో పాటు సంగీత దర్శకుడు రథన్‌ పాటలూ కారణమే. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత తెలుగులో సందీప్‌ కిషన్‌ హీరోగా మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాకు రథన్‌ సంగీతం అందించాడు. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. అందులో పాటలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. లేటెస్టుగా మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడీ సంగీత దర్శకుడు. ‘సినిమా చూపిస్త మావ’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్‌’ సినిమాల నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ నిర్మించిన తాజా సినిమా ‘హుషారు’కు సంగీతం అందిస్తున్నాడు.

 

 

ఈ సినిమాలో తొలిపాటను ఈ రోజు (సోమవారం) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రథన్‌ తనకు ‘అర్జున్‌రెడ్డి’ పాటల కంటే ‘హుషారు’లో పాటలంటే ఇష్టమన్నాడు. మధ్యలో చేసిన ‘మనసుకు నచ్చింది’ సినిమాను అతడు మర్చిపోయినట్టున్నాడు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత తను చేసిన సినిమా ఇదేనని వ్యాఖ్యానించాడు. ‘‘ఐ లవ్‌ దిస్‌ మూవీ. ఇందులో పాటలు నా ఫేవరేట్‌ సాంగ్స్‌. ‘అర్జున్‌రెడ్డి’ పాటల కంటే ఈ సినిమాలో పాటలు నాకు ఎక్కువగా నచ్చాయి’’ అని రథన్‌ మాట్లాడారు. ఆయన స్వర సారథ్యంలో భాస్కరభట్ల సాహిత్యం అందించిన ‘న న నా’ పాటను సోమవారం విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here