ENGLISH | TELUGU  

ముళ్లపూడి వెంకటరమణ గారి సంస్మరణ

on Feb 23, 2019

తెలుగు సినీ ప్రేక్షకులందరినీ తన మాటలతో పరవశింపజేసిన మాటల మాంత్రికుడు ముళ్ళపూడివెంకటరమణ గారు. ఆయన సంస్మరణ దినం ఫిబ్రవరి 24.దీనిని పురస్కరించుకొని ముళ్ళపూడి గారిని అందరం ఒక్కసారి స్మరణం చేసుకొని ఆయన వైశిష్య్ఠాన్ని మననం చేసుకొని ఆయన కీర్తిని స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తూ... ముళ్ళపూడి గారు రాసిన దాన్ని ఒక్కసారి ముందుమాటగా మీకు చెప్పాలనుకుంటున్నాం.... అదేంటంటే...

ముత్యాల ముగ్గులోని మనిషన్నాక కాసింత కళాపోషణుండాలయ్యా.. ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది..? అని రాసింది ఈయనేనండి...అందుకే ఈయనలోని కళానైపుణ్యాన్ని ఒక్కసారి మననం చేసుకుంటూ... ఆయన వివరాలు అందరికీ తెలియచేసుకుందాం......

1931 జూన్ 28 వ తేదీన ధవళేశ్వరంలో జన్మించారు. ఈయన అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు. తండ్రి సింహాచలం. ఈయన గోదావరి ఆనకట్ట ఆఫీసులో పనిచేసేవారు. వారి పూర్వీకులు బరంపురానికి  చెందినవారు. రమణ గారి కుటుంబం గోదావరి తీరులో ఒక మేడలో ఉండేవారు. రమణ చిన్నతనం లోనే తండ్రి మరణించారు. కుటుంబం ఇబ్బందుల్లో పడింది. దీంతో రమణ గారు సాహసం చేసి ఆయన తల్లిగారిని తీసుకొని మద్రాస్ వెళ్ళిపోయారు. మద్రాస్ లో ఒక్క అక్క బాల మధ్య మొదలు పెట్టిన రమణ గారు 5, 6 తరగతులు మద్రాస్ పి.యస్.స్కూల్ లో చదివారు. 7,8 తరగతులు రాజమండ్రిలో రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్ లో చదివారు. ఎస్.ఎస్.సి హానర్స్ దాక కేసరి స్కూల్ లో చదివారు.పాఠశాల విద్యార్ధిగా ఆయన లెక్కల్లోను, డిబేట్లు  వ్యాసరచనలలోను ప్రతిభచూపించేవారట. పద్యాలు అల్లటం
ఈయనకున్న హాబీ...నాటకాల్లో వేషలు వేయాలన్నా ఆసక్తి.

1945లో...బాల పత్రికలో రమణగారు రాసిన అమ్మమాట వినకపోతే....అనే మొదటికధ అచ్చయిందట. అందులోనే బాలశతకం పద్యాలు కూడా అచ్చయ్యాయంట. ఆ ఉత్సాహంతోనే ఉదయ భాను అనే పత్రిక మొదలు పెట్టి తను ఎడిటర్ అయిపోయారుట. మిత్రులతో కలసి ప్రదర్శనలు నిర్వహించి వచ్చిన డబ్బులతో సైకలోస్టేట్  మిషన్ కొన్నారట...అలా మొదలు పెట్టిన పత్రికకు రమణ ఎడిటర్ చిత్రకారుడు బాపూ గారు. ఆర్ధిక ఇబ్బందులతో ఎస్.ఎస్.ఎల్సీతో చదువు ఆపేసిన రమణగారు చిన్నచితక ఉద్యోగాలు ఏవోస్తే అవి చేసారంట. 1954లో ఆంధ్రపత్రిక దిన పత్రికకు సబ్ ఎడిటర్ గా చేరారట. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడే బుడుగు వేసారంట.... బుడుగు చిన్నపిల్లల భాష మనస్తత్వం అల్లరి గురించి...హాస్యప్రధానమైన బొమ్మలతో కూడిన రచన....ఇలా రచయితగా చూస్తే ఆయన రాసిన గ్రంధాలెన్నో.....

అవేంటంటే....

రుణానందలహరి....అప్పుల అప్పారావు.....అప్పలప్రవసనం
విక్రమార్కుని మార్కు సింహాసనం....
సినీమాయాలోకం చిత్రంవిచిత్రం.. గిరీశం లెక్చరర్లు......
సినిమాలపై సెటైర్లు..రాజకీయ బేతాళం.....పంచవింశతి...
రాజకీయచదరంగం.....ఇద్దరమ్మాయిలు ముగ్గురు అబ్బాయిల ప్రేమాయణం.....ఇద్దరు మిత్రులు...
వెండితెర నవల.....తిరుప్పావై దివ్య ప్రబంధం...
మేలుపలుకులు మేలుకొలుపులు.....రమణీయ భదవద్గీత..
రామాయణం...శ్రీక్రిష్ణ లీలలు....ఇలా ఆయన రచనలు
బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఆయన రచనలకు
బాపూ బొమ్మ తోడై ఇంకా ప్రసిద్ధిపొందాయి. అందుకే
బాపూ రమణల జంటగా పిలుస్తారు...ఆయన రాసిన సినిమాల వివరాల్లోకి వస్తే....
సాక్షి...గోరంతదీపం....పెళ్ళిపుస్తకం...రాధాగోపాలం...
పంచదార చిలక...మనవూరి పాండవులు...మిస్టర్ పెళ్ళాం
జేబుదొంగ....ముత్యాలముగ్గు....రాజాధిరాజా..రాధాకల్యాణం
ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకు కధమాటలు రాసారు.
ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ చేసిన సినిమా పెళ్ళిపుస్తకం...
ఇది బాపూరమణల స్నేహానికి చిహ్నం...అని చెప్పొచ్చు.
సినీ చరిత్రలో సుమారు 68 సంవత్సరాలపాటు కలిసిమెలిసి
పనిచేసి సుదీర్ఘకాలం పాటు స్నేహపూర్వకంగా కలసిమెలసి
ఉన్నజంటగా బాపూరమణలద్వయం రికార్డు స్రుష్టించారు.
అందుకే బాపూరమణల జంట సినీజగత్తులో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇలా ఎన్నో అద్బుతాలు
స్రుష్టించిన ముళ్ళపూడిగారు ఫిబ్రవరి 24 వ తేదీన స్వర్గస్థులయ్యారు. అయినా తెలుగు వారెవ్వరూ
వారినిమరిచిపోరు అన్నది అక్షరసత్యం.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.