ఇంప్రెస్ చేయబోయిన అవినాష్.. పట్టించుకోని మోనాల్!
on Sep 23, 2020
మొదటి రెండువారాలు బిగ్ బాస్ షో ఎలా ఉన్నా ప్రేక్షకులు చూశారు. కొత్తదనం కోసం వెతికారు. కంటెస్టెంట్లు కొత్తవారయినా, హౌస్ లో చురుగ్గా లేకపోయినా వేరే ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో బిగ్ బాస్ చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఈ వారం ప్రేక్షకులు ఐపిఎల్ వైపు మొగ్గుచూపడంతో బిగ్ బాస్ కు గట్టిపోటీ ఎదురైంది. దాంతో బిగ్ హౌస్ లోనూ టాస్క్ ల జోరు పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో భాగంగా ప్రసారమైన 17వ ఎపిసోడ్ మార్నింగ్ మస్తీ, ఫిజికల్ టాస్క్ లతో బిగ్ హౌస్ లోని సభ్యులంతా ఫుల్ బిజీగా మారారు. ఐపీఎల్ పోటీని ఎదుర్కొన్నేలా, ప్రేక్షకులను ఆకట్టుకునేలా బిగ్ బాస్ వారికి టాస్క్ ఇచ్చారు. మనుషులు, రోబోలు టీమ్ లుగా విడిపోయిన కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు కలబడి తమకు ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
బిగ్ హౌస్ లో 16వ రోజు మాయామశ్చీంద్రా అంటూ భారతీయుడు సినిమాలోని పాట వేకప్ సాంగ్ గా రావడంతో సభ్యులంతా తమదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఆ తర్వాత మార్నింగ్ మస్తీలో భాగంగా మోనాల్ ఇంటి సభ్యులకు తెలుగు రైమ్స్ నేర్పించాలని బిగ్ బాస్ ఆదేశించారు. దాంతో తెలుగుటీచర్ అవతారం ఎత్తిన మోనాల్ "బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు" రైమ్ చెప్పితే ఇంటి సభ్యులంతా పాడారు. మోనాల్ తెలుగు చూసి హౌస్మేట్స్ పడిపడి నవ్వారు.
అఖిల్, మోనాల్, అవినాష్ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో మోనాల్ ను ఇంప్రెస్ చేయడానికి నాగార్జున సాంగ్ అందుకున్నాడు అవినాష్. 'నిర్ణయం' సినిమాలో అమలను ఆటపట్టించే "హలో గురు ప్రేమ కోసమే జీవితం" పాట పాడాడు.
సన్ డే ఫన్ డే అంటూ నాగార్జునను ఇమినేట్ చేస్తూ సరదా పంచాడు. అయితే మోనాల్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిచన్ లో వంట చేస్తున్న సుజాతను ఆటపట్టించాడు.
Also Read