మోహన్‌లాల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
on Jul 13, 2020
టాలీవుడ్లో రూ. 20 కోట్ల పైగా రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్లు కనీసం ఏడుగురు ఉన్నారని అంచనా. రెమ్యూనరేషన్ల పరంగా చూసుకుంటే ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరుస క్రమంలో వస్తారు. వీళ్లలో ప్రభాస్ రూ. 50 కోట్ల మార్కును దాటేశాడు. టాలీవుడ్‌తో పోలిస్తే మలయాళం చిత్రసీమలో హీరోల రెమ్యూనరేషన్ చాలా తక్కువని చెప్పాలి. అక్కడ అందరికంటే అత్యధిక పారితోషిక తీసుకుంటున్నది వెటరన్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. ఆయన ఒక్కో సినిమాకు తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 5 కోట్లు మాత్రమే. అదీ మలయాళం సినిమాకైతేనే. తెలుగు లేదా తమిళ భాషల్లో నటించడానికి మాత్రం ఆయన రూ. 8 కోట్లు తీసుకుంటారు. ప్రస్తుతం సినిమాల షూటింగ్‌లు లేక చిత్రసీమ అల్లాడిపోతున్న నేపథ్యంలో ఈ రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి కూడా ఆయన సరేనంటుండటం ఆయన గొప్పతనంగా చెప్పుకోవాలి.
మలయాళంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ 6 యాక్టర్లు ఎవరంటే...
1. మోహన్‌లాల్ - రూ. 5 కోట్ల నుంచి రూ. 8 కోట్లు
2. మమ్ముట్టి - రూ. 4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు
3. పృథ్వీరాజ్ - రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లు
4. నివిన్ పాలీ - రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లు
5. దుల్కర్ సల్మాన్ - రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లు
6. ఫహద్ ఫాజిల్ - రూ. 80 లక్షల నుంచి రూ. 1 కోటి