మంచు విష్ణు దర్శకత్వంలో మంచు మనోజ్ ??...
on Jun 5, 2018
మోహన్ బాబు వారసులుగా సినీరంగంలో అడుగుపెట్టిన విష్ణు,మనోజ్ లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.. విష్ణు ఢీ, దేనికైనా రెడీ లాంటి సినిమాలతో ఒకటి రెండు హిట్లు అందుకున్నాడు.. ఇక మనోజ్, సినిమాలతో అంతగా విజయాలు సాధించకపోయినా.. కష్టపడతాడు, కొత్తగా ట్రై చేస్తాడనే పేరు మాత్రం తెచ్చుకున్నాడు.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిద్దరూ నిలబడాలంటే కచ్చితంగా హిట్ కొట్టాలి.. అందుకే ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది.. ఈ సినిమాలో మనోజ్ హీరోగా చేస్తుండగా.. విష్ణు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. తమ్ముడి కోసం అన్న నిజంగా దర్శకుడిగా మారుతున్నాడా?? తమ్ముడితో కలిసి అన్న హిట్ కొడతాడా?? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే...