మోహన్ బాబు మళ్లీ తాతయ్యాడోచ్!
on Jan 3, 2018
మంచు ఫ్యామిలీ మాం...చి హ్యాపీ మూడ్ లో ఉంది. కారణం... ఎట్టకేలకు మంచు ఫ్యామిలీలో మూడో తరం వారసుడు పుట్టేశాడు. మంచు విష్ణు, విరానికా దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో తాత మోహన్ బాబు ఆనందానికి అవధులు లేవు. ‘నా బిడ్డలు జన్మించిన రోజున మూడు పూట్లా షిప్ట్ లతో షూటింగులతో బిజీగా ఉన్నాను. ఇప్పుడు మనవళ్లు పుడుతున్నారు. ప్రస్తుతం అన్ని షిఫ్టులు వీళ్లతోనే. మా మంచు ఫ్యామిలీలో మూడో తరం హీరో పుట్టాడు’ అని సోెషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మోహన్ బాబు. అయితే... మంచు విష్ణు కొడుకు అంటూ... ఓ పిల్లాడి ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై విష్ణు స్పందిస్తూ... ’ సోషల్ మీడియాలో ఎవరో కన్నబిడ్డను నా బిడ్డ అని చూపిస్తున్నారు. అది సంస్కారం కాదు. మా అబ్బాయిని మేం ఎవరికీ చూపించలేదు. త్వరలోనే మీడియా ద్వారా అభిమానులకు, శ్రేయోభిలాషులకు చూపిస్తాం. దయచేసి ఆ ఫోటోను తీసేయండి’ అని తెలియజేశాడు. మొత్తంగా... తెలుగు తెరకు మరో బుల్లి హీరో పుట్టాడన్నమాట.