పోస్ట్ పోన్ అయిన మెగా ప్రిన్సెస్ ఆడియో ఫంక్షన్..!
on Apr 19, 2016
మెగా ప్రిన్సెస్ ట్యాగ్ తో సినిమాల్లోకి ఎంటరౌతోంది మెగాబ్రదర్ నాగబాబు డాటర్ నీహారిక. యంగ్ హీరో నాగశౌర్య, నీహారిక జంటగా, మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు ఫేం రామరాజు తెరకెక్కిస్తున్న సినిమా ఒక మనసు. ఫీల్ గుడ్ మెచ్యూర్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కిందని మూవీ టీం చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియోను ఈ నెల 27న విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసి మే రెండో వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మూవీ టీం. మెగాస్టార్ ను ఛీఫ్ గెస్ట్ గా పిలవాలని మూవీ టీం అనుకుంటున్నారని, కానీ ఆయన ఇప్పుడు వేరే పనుల్లో బిజీగా ఉన్నారని, అందుకే మూవీ ఆడియోను కూడా పోస్ట్ పోన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీహారిక కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకోవడం, యంగ్ హీరో నాగశౌర్య కళ్యాణవైభోగమే తో హిట్స్ లో ఉండటంతో, ఫిల్మ్ వర్గాల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. దర్శకనిర్మాత మధుర శ్రీథర్ సినిమాను నిర్మిస్తున్నారు.