మెగా హీరోతో ఎన్టీఆర్ మ్యానేజర్ సినిమా..!
on Jun 4, 2016
మెగా క్యాంప్ నుంచి నందమూరి క్యాంప్ కు, లేదా అటు నుంచి ఇటు గానీ ఎవరైనా సినిమాలు చేస్తే అదో పెద్ద వార్త అయిపోతుంది. రెండు ఫ్యామిలీలకు ప్రొఫెషనల్ గా ఉన్న పోటీయే అందుక్కారణమని చెప్పచ్చు. అలాంటిది ఎన్టీఆర్ దగ్గర మేనేజర్ గా చేసిన వ్యక్తి మెగా క్యాంప్ లో సినిమాను నిర్మించడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర మ్యానేజర్ గా పనిచేసిన కృష్ణ, నిర్మాతగా మారి మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమాను నిర్మిస్తున్నాడు.
నిజానికి ఎన్టీఆర్ తోనే సినిమాను నిర్మించాలని ఉన్నా, తారక్ సినిమాలు బడ్జెట్ అంతా వేరే లెవల్లో ఉండటంతో, కాస్త మీడియం బడ్జెట్ లో అందుబాటులో ఉన్న సాయి ధరమ్ తో సినిమాను నిర్మిస్తున్నాడు కృష్ణ. గోపీచంద్ వాంటెడ్ సినిమాను డైరెక్ట్ చేసిన బివిఎస్ రవి డైరెక్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా సుప్రీమ్ తో కెరీర్లోనే భారీ హిట్ కొట్టి ఊపుమీదున్న సాయి ధరమ్, గోపీ చంద్ మలినేనితో ఒక సినిమా, బివిఎస్ రవితో ఒక సినిమా కమిట్ అయ్యాడు. గోపీ చంద్ మలినేనితో సినిమా స్టార్ట్ కావడం అనుమానమే అంటూ కొన్ని వార్తలు రావడం, అవి రూమర్సే నమ్మద్దు అంటూ గోపీచంద్ క్లారిటీ ఇవ్వడం తెలిసిందే..