'అంతరిక్షం' టైటిల్ తో మెగా హీరో..
on Jun 5, 2018
వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ నుండొచ్చినా.. ఆ ఇమేజ్ ని తన మీద ఏమాత్రం పడనివ్వకుండా.. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.. కంచె, ఫిదా, తొలిప్రేమ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న వరుణ్.. త్వరలో ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఈ సినిమాకి 'అంతరిక్షం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది.. మొదటి సినిమా 'ఘాజీ'తోనే శభాష్ అనిపించుకున్న సంకల్ప్, ఈ సినిమాతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి...