పవన్ కళ్యాన్ దర్శకుడుతో అల్లు శిరీష్!!
on May 27, 2019
లవ్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు కరుణాకరన్. ముఖ్యంగా మెగా హీరోలకు ఈ డైరక్టర్ మంచి విజయాలు ఇచ్చాడనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని కీలక మలుపు తిప్పిన `తొలిప్రేమ`. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం కావడం విశేషం. ఆ తర్వాత పవన్ తోనే బాలుని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో `హ్యాపీ`ని రూపొందించి మ్యూజికల్ హట్స్ అందుకున్నాడు కరుణాకరన్. అలాగే పుష్కరకాలం గ్యాప్ తర్వాత అదే మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ తో `తేజ్ ఐ లవ్ యూ` (2008) చిత్రాన్ని రూపొందించాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. అంతేకాదు ఇప్పుడు మరో మెగా హీరో కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టున్నాడని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే అల్లు శిరీష్ కథానాయుకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా రానుందని టాలీవుడ్ టాక్. ఇప్పటికే కరుణాకరన్ ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ ని శిరీష్ కి వినిపించడం జరిగిందట. శిరీష్ కి కూడా కథ నచ్చడంతో ఓకే చేసినట్టు తెలుస్తోంది. శిరీష్ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే అల్లు అర్జున్ తో కరుణాకరన్ రూపొందించిన హ్యాపీని గీతా ఆర్ట్స్ నిర్మించగా ఇప్పుడు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తో చేయబోయే సినిమాని కూడా గీతా ఆర్ట్స్ నిర్మించనుందట.