ఎంసీఏ ఫస్టాఫ్ రివ్యూ
on Dec 21, 2017
వరుస సక్సెస్‌లతో డబుల్ హ్యాట్రిక్‌లు కొట్టి.. మూడో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తోన్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటేస్ట్ మూవీ ఎంసీఏ. టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల్లో మంచి రెస్సాన్స్ వచ్చింది. దానికి తోడు సహజ నటనతో మాయ చేస్తున్న సాయిపల్లవి హీరోయిన్గా చేస్తుండటం.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మాత కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎంసీఏ. ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోలు అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించబడ్డాయి.
దీంతో సినిమా విశేషాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు ప్రేక్షకులు. ఎంసీఏ టైటిల్ సాంగ్‌తో సినిమా స్టార్టవుతుందట.. బావ, మరదల్లుగా నాని, సాయిపల్లవిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందట.. భూమిక వరంగల్‌కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో నాని బలవంతంగా అక్కడికి వెళతాడట. ఫస్టాఫ్ మొత్తం ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా వెళ్లిపోతుందట. లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో దర్శకుడు వేణు శ్రీరాం మొదటి భాగంలో ఎంటర్టైనింగ్కే పెద్దపీట వేసినట్లు సమాచారం. ఫుల్ రివ్యూ కోసం తెలుగువన్ని ఫాలో అవ్వండి.