రవితేజ కమింగ్ సూన్..?
on Jan 6, 2017
సంవత్సరానికి రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది టాలీవుడ్‌ను నిరాశకు గురిచేశాడు..కెరీర్లో ఎప్పుడూ లేనంత గ్యాప్ తీసుకున్నాడు. దీంతో ఆయనపై అనేక రూమర్స్ వస్తున్నాయి..ఆరోగ్యం బాగోలేదని అందుకే విదేశాల్లో వైద్యం చేయించుకుంటున్నాడని..ఫ్యామిలీతో వరల్డ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడని ఇలా లేనిపోని ప్రచారం జరుగుతోంది..మరోవైపు ఈ ఏడాదైనా సినిమా చేస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారందరికీ తీపికబురును అందించాడు రవి..తనకు డాన్ శీను, బలుపు వంటి కమర్షియల్ సక్సెస్‌లు ఇచ్చిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేసేందుకు మాస్ మహారాజా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్. ఈ మూవీలో తనకు బాగా అచ్చివచ్చిన పోలీస్ గెటప్‌లో రవితేజ కనిపించబోతున్నాడట. మరీ ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్దికాలం వెయిట్ చేయక తప్పదు.