మంచు ఈవెంట్.. మహేశ్ స్పెషల్ ఎట్రాక్షన్!
on Jan 16, 2021
మంచు విష్ణు భార్య విరానికా బర్త్‌డే జనవరి 15. ఈ సందర్భంగా విష్ణు ఇచ్చిన పార్టీకి మహేశ్, నమ్రత దంపతులు హాజరయ్యారు. దీంతో ఆ పార్టీకి స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్లయింది. వారితో పాటు హీరో గోపీచంద్ కూడా ఈ పార్టీకి వచ్చాడు. విష్ణు, గోపి మంచి ఫ్రెండ్స్. తన భార్య బర్త్‌డేని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి విష్ణు పార్టీ ఇచ్చాడు. దీనికి మహేశ్ దంపతులతో పాటు, గోపీచంద్‌నూ ఆహ్వానించాడు. విష్ణు ఆహ్వానం మేరకు భార్య నమ్రతతో కలిసి ఆ బర్త్‌డే పార్టీకి అటెంటయ్యాడు మహేశ్. ఆ దంపతుల రాకతో విష్ణు దంపతులు ఖుషీ అయ్యారు.
విష్ణు ఎంత సంబరపడ్డాడంటే.. మహేశ్ కపుల్‌తో తమ కపుల్ తీయించుకున్న ఫొటోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేశాడు. దాంతో పాటు, "ఈ ఫొటోలోని ఒక వ్యక్తి రోజు రోజుకీ యువకుడిగా ఎదుగుతూ, మరింత ఆందంగా కనిపిస్తున్నాడు. ఇది అతని మంచి గుణం, దయార్ద్ర హృదయంతోనే అని నేను బలంగా నమ్ముతున్నాను." అని రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్‌కు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటు మహేశ్ ఫ్యాన్స్, అటు విష్ణు ఫ్యాన్స్ ఈ పోస్ట్‌కు ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోలో మహేశ్, నమ్రత ఇద్దరూ క్యాజువల్ లుక్స్‌లో ఆకట్టుకుంటున్నారు. మహేశ్ బ్లాక్ కలర్ నెక్ టీ షర్ట్, లైట్ బ్యూ జీన్స్ ధరించగా, విష్ణు బ్లాక్ కలర్ టీ షర్ట్, ప్యాంట్ ధరించాడు.