హ్యాట్రిక్ కొట్టిన మంచు ఫ్యామిలీ
on Mar 23, 2017
సుమారు 500పైగా సినిమాలను నిర్మించి హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, విద్యావేత్తగా ఇలా అన్ని రంగాల్లో ఎన్నో విజయాలను సాధించారు మోహన్ బాబు. ఆయన వారసులుగా ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్, లక్ష్మీలు మాత్రం ఆయన స్థాయిని అందుకోలేకపోతున్నారు. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అవుతున్నా. ఎవరికీ ఇంత వరకు స్టార్ ఇమేజ్ రాలేదు.
అయినా పట్టు వదలకుండా సినిమాలు చేస్తున్నప్పటికీ మంచు వారసులకు లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వీరు నటించిన మూడు సినిమాలు విడుదలవ్వగా...రిజల్ట్ దగ్గరికి వచ్చే సరికి అవి బోల్తా కొట్టేసాయి. విష్ణు నటించిన "లక్కున్నోడు " ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు..అలాగే మార్చి మొదటి వారంలో వచ్చిన మనోజ్ "గుంటూరోడు" బొక్క బోర్లా పడింది. మెగాస్టార్ వాయిస్ ఓవర్ కూడా ఆఖరికి మనోజ్‌ని రక్షించలేకపోయింది. తాజాగా మంచు లక్ష్మీ నటించిన "లక్ష్మీ బాంబ్" కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. మొత్తానికి మూడు నెలల్లో మూడు ఫ్లాపులతో మంచు ఫ్యామిలీ హ్యాట్రిక్ కొట్టింది.