`హీరో`కు హీరోయిన్ దొరికింది!!`
on Mar 15, 2019
వరుస చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రజంట్ భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ లో `డియర్ కామ్రేడ్` చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తోన్నవిషయం తెలిసిందే. వీటితో పాటుగా లేటెస్ట్ గా తమిళ చిత్ర దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల అఫీషియల్ గా కూడా ప్రకటించారు. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసారట. ఆమె మరెవరో కాదు ` మజిద్ మజిద్` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక మోహనన్. ఇటీవల సూపర్ స్టార్ సరసన `పేట` సినిమాలో కూడా నటించింది. ఇక ఇప్పుడు తెలుగులో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే ఆఫర్ ని చేజిక్కించుకుంది. `హీరో` విజయ్ దేవరకొండ బైస్ రేసర్ గా నటిస్తుండగా మాళవిక మ్యుజిషియన్ గా నటించనుందట. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 22న షూటింగ్ ప్రారంభం కానుంది.