సెల్ఫ్ క్వారంటైన్లో మలైకా.. బాల్కనీలోంచే అమ్మను చూసుకుంటున్న కొడుకు!
on Sep 14, 2020
బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కొవిడ్ 19 అని సెప్టెంబర్ 6న నిర్ధారణ అయిన, కొన్ని గంటలకే తనకు కూడా ఆ వైరస్ సోకిందని మలైకా అరోరా తన అభిమానులకు సమాచారం అందించింది. తనకు కొవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయిన విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రాసిన స్టేట్మెంట్తో ఆమె తెలియజేసింది. లేటెస్ట్గా సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న తాను.. కొడుకు అర్హాన్‌తో, తన పెట్ డాగ్‌తో ఎలా కనెక్ట్ అవుతున్నదీ హృదయాన్ని స్పృశించే ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది మలైకా.
మరో బాల్కనీలో నుంచి తనను చూస్తున్న కొడుకు అర్హాన్, పెంపుడు కుక్క పిక్చర్‌ను షేర్ చేసింది మలైకా. ఆ పిక్చర్‌ను బట్టి కొవిడ్ 19 అని నిర్ధారణ అయిన దగ్గర్నుంచీ ఆమె వారి నుంచి వేరుగా ఉంటోందని స్పష్టంగా తెలుస్తోంది. ఆ పిక్చర్తో పాటు ఓ అందమైన మెసేజ్‌ను కూడా ఆమె షేర్ చేసింది.
"ప్రేమకు హద్దులు తెలీవు" అంటూ దాన్ని మొదలు పెట్టింది మలైకా. "సోషల్ డిస్టాన్సింగ్, సెల్ఫ్ క్వారంటైన్ టైమ్‌లో ఒకరి గురించి ఒకరు తెలుసుకోడానికీ, ఒకరినొకరు చూసుకోడానికీ, మాట్లాడుకోడానికీ మనం ఇప్పటికీ మార్గాలు వెతుకుతున్నాం. మరి కొన్ని రోజుల పాటు నా ఇద్దరు బేబీలను కౌగలించుకోలేనని నా గుండె పగిలిపోతున్న వేళ, వాళ్ల స్వీట్ ఫేసులను చూడగానే నాకెంతో ధైర్యం, శక్తి వచ్చేస్తున్నాయి" అని ఆమె రాసుకొచ్చింది. ఆ పోస్ట్‌కు "this too shall pass" అనే హ్యాష్‌ట్యాగ్ జోడించింది.
Also Read