ENGLISH | TELUGU  

నిజమే.. మెగాస్టార్ సినిమాలో సూపర్‌స్టార్!

on Feb 24, 2020

 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్ ఒక కీలక పాత్ర చేయడం ఖరారైంది. 1980ల కాలానికి చెందిన కథతో తయారవుతున్న ఈ మూవీలో విప్లవ నాయకునిగా చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో కథకు అత్యంత కీలకమైన ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి మొదట రాంచరణ్ సిద్ధమయ్యాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా పూర్తయ్యే దాకా మరో సినిమా చెయ్యకూడదనే రాజమౌళి నిబంధన అతనికి అడ్డంకిగా మారింది. దాంతో గత్యంతరం లేక ఆ పాత్రను మరొకరితో చేయించాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

అయితే ఎవరో ఒకరితో కాకుండా మాస్ స్టార్‌గా ఆడియెన్స్‌లో క్రేజ్ ఉన్న హీరో చేస్తేనే ఆ క్యారెక్టర్‌కు విలువ ఉంటుందని కొరటాల శివ భావించాడు. చరణ్ స్థానంలో అల్లు అర్జున్‌తో చేయించాలని కూడా ఆలోచించారు. అయితే దానికి ఏ కారణం చేతనో చిరంజీవి సుముఖత చూపించలేదు. మహేశ్ అయితే బాగుంటుందని ఆయన సూచించారు. దీనికి చరణ్ కూడా ఆనందం వ్యక్తం చేశాడు. మెగా ఫ్యామిలీకి మహేశ్ సన్నిహితుడు కావడం, చరణ్‌తో అతనికి స్నేహ సంబంధాలు ఉండటం, చిరంజీవిని అభిమానించే వ్యక్తి కావడం దీనికి కారణం. పైగా కొరటాల శివతో ఇప్పటికే అతను రెండు సినిమాలు చేసివున్నాడు. ఆ ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సూచన మేరకు మహేశ్‌ను కలిసిన కొరటాల స్క్రిప్టును వినిపించి, ఆ క్యారెక్టర్ ప్రాధాన్యతను వివరించాడు. ఆశ్చర్యకరంగా ఎక్కువ సమయం తీసుకోకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మహేశ్. 

చిరంజీవి తరహాలోనే మహేశ్ సైతం ఈ మూవీలో ఒక విప్లవవాదిగా కనిపించనున్నాడు. అంటే మరో మాటలో చెప్పాలంటే నక్సలైట్‌గా కనిపిస్తాడన్న మాట. అతని పాత్ర 20 నిమిషాల నుంచి 25 నిమిషాల నిడివి ఉంటుందని ఆ సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇలా మెగాస్టార్, సూపర్‌స్టార్ అపూర్వ కలయికలో సినిమా రానుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారింది. ఇరువురి ఫ్యాన్స్ కూడా ఈ న్యూస్‌ను సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2021 ఆరంభంలో విడుదల కానున్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.