`సర్కార్` కు `స్పైడర్ ట్వీట్!!!
on Nov 8, 2018
మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన `సర్కార్` చిత్రం దీపావళి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. తమిళ్ , తెలుగు లో ఈ చిత్రం యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది. అయినా కూడా కలెక్షన్స్ మాత్రం ఎక్కడా తగ్గకుండా రన్ అవుతోంది. ముఖ్యంగా విజయ్ అభిమానులు సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీపావళి రోజున సర్కార్ సినిమాను మహేష్ బాబు చూసాడు. చూడటమే కాకుండా ``సర్కార్` సినిమా ఇప్పుడే చూసాను. ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామా. మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఎంజాయ్ చేశాను. మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిలిం. టీమ్ అందరికీ శుభాకాంక్షలు`` అంటూ ట్వీట్ పెట్టాడు మహేష్ బాబు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది.
గతంలో మురుగదాస్, మహేష్ కలయికలో `స్పైడర్` సినిమా వచ్చింది. కానీ, ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయినా కూడా అవేమీ మహేష్ మనసులో పెట్టుకోకుండా `సర్కార్` గురించి ట్వీట్ పెట్టడం గొప్ప విషయం అంటున్నారు సినీ పండితులు. ఈ ట్వీట్ చూసిన మురుగదాస్ షాకై ఉంటాడు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు ట్వీట్ పెడుతూ ఆయా సినిమా యూనిట్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు మహేష్. ఇప్పుడు సర్కార్ వంతయ్యింది.
ఓటు హక్కు ప్రాధాన్యత గురించి చెబతూ రూపొందిన చిత్రమిది. మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినా సినిమాలేవీ పెద్దగా లేకపోవడంతో సర్కార్ వసూళ్ల పరంగా బాగానే రాబడుతుందట. మొదటి రోజు ఈ చిత్రం 47 కోట్లు రాబట్టిన్నట్లు తెలుస్తోంది.